Share News

టీడీపీ హయాంలో ముస్లింల అభివృద్ధి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:49 AM

టీడీపీ హయాంలో ముస్లింల అభివృద్ధి జరిగిందని కర్నూలు పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు.

టీడీపీ హయాంలో ముస్లింల అభివృద్ధి
ముస్లింలతో టీజీ భరత్‌, బస్తిపాటి నాగరాజు

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 4: టీడీపీ హయాంలో ముస్లింల అభివృద్ధి జరిగిందని కర్నూలు పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. గురువారం నగరంలోని 6వ వార్డులోని గడ్డవీధిలో జనసేన కర్నూలు ఇన్‌చార్జి ఆర్షద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎంపీ ఆభ్యర్థి బస్తిపాటి నాగరాజు, జనసేన పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్హంఖాన్‌తో కలిసి టీజీ భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు పెద్ద పీట వేసిందన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో మసీదుల అభివృద్ధి కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో మసీదులకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. 2018లో కర్నూలులో ఇస్తేమా నిర్వహించినప్పుడు రూ.10 కోట్లు టీడీపీ ఇచ్చిందని గుర్తు చేశారు. ముస్లింలకు రంజాన్‌ తోఫాను ఇచ్చిందన్నారు. ఈ కార్యక్ర మాలన్నీ టీడీపీ, బీజేపీ పోత్తులో ఉన్నప్పుడే జరిగాయని, కేవలం ఎన్నికల ముందుకు బీజేపీతో టీడీపీ పొత్తు ఉండదని, టీడీపీని గెలిపిస్తే ముస్లింలు నష్టపోతారని అసత్య ప్రచారాలు చేసే వైసీపీ నాయకులు వ్యాఖ్యలు నమ్మ వద్దని విజ్ఞప్తి చేశారు. సీఏఏ బిల్లుకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు తెలప డమే కాకుండా రాష్ట్రంలో నోటిఫికేషన్‌ సైతం తెచ్చిందన్నారు. మంచి పనులు చేస్తున్న టీడీపీపై నిందలు వేయడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ బాషా, హమీద్‌, నాయకులు మహబూబ్‌ బాషా, ఇబ్రహిం, బూత్‌ ఇన్‌చార్జిలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీతోనే నగరాభివృద్ధి: తెలుగుదేశం పార్టీతోనే నగరం అభివృద్ధి చెందుతుందని కర్నూలు పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. గురువారం నగరం లోని 2 వార్డులోని పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌లో నుంచి టీజీ భరత్‌ భరోసా యాత్ర సుబేదార్‌ వీఽధి, లక్ష్మీనారాయణ బుక్‌, జైన్స్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో సాగింది. నగరంలో యువతకు అవసరమైన ఉపాధి అవకాశాలకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నానని, అలాగే మహిళలు, కార్మికులు, దుకాణాల్లో పని చేసే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత నష్టపో యామో పరిస్థితులు ఒక సారి గుర్తు చేసుకోని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వార్డు, బూత్‌ ఇన్‌చార్జిలు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:49 AM