కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృధ్ది
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:57 PM
సీఎం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మరువలేని ఆనందం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధికి తొలి ప్రాధాన్యత, పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించడం నా లక్ష్యం. ప్రధాని మోదీతో మాట్లాడుతూ మా జిల్లాకు కియా వంటి పరిశ్రమలు కావాలని కోరాను. ఆరు నెలలు ఏడాదిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.

టీజీ భరత్, రాష్ట్ర మంత్రి
కర్నూలు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మరువలేని ఆనందం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధికి తొలి ప్రాధాన్యత, పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించడం నా లక్ష్యం. ప్రధాని మోదీతో మాట్లాడుతూ మా జిల్లాకు కియా వంటి పరిశ్రమలు కావాలని కోరాను. ఆరు నెలలు ఏడాదిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. కర్నూలు-విజయవాడ రెగ్యులర్ విమాన సర్వీసును ఏర్పాటు చేస్తాను. జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తా. జిల్లాలో అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తాను.