Share News

ప్రజాస్వామ్యం అపహాస్యం

ABN , Publish Date - May 16 , 2024 | 11:24 PM

రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం డబ్బును వరదలా పారించాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

కర్నూలు(అర్బన్‌), మే 16: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం డబ్బును వరదలా పారించాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీ కే.బాబురావుతో కలిసి ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ధ్వజమెత్తారు. ఎన్నికల తీరు మారాలని, రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కేంద్రంలో రాహుల్‌ గాంధీ, రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో పని చేయడానికి ఎందరో నాయకులు, కార్యకర్తలు సిద్ధ్దంగా ఉన్నారన్నారు. జిల్లా ఆధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, ఉండవల్లి వెంకటన్న, అశోకరత్నం మాదిగ, బ్రతుకన్న, బీ.రామాంజ నేయులు, లాజర్‌, షేక్‌ ఖాజా హుస్సేన్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:24 PM