Share News

రేపటి నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:12 AM

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు డి గ్రీ 2, 4, 6వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహి స్తున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు తెలిపారు.

రేపటి నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

కర్నూలు(అర్బన్‌), మే 14: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు డి గ్రీ 2, 4, 6వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహి స్తున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలోని 61 పరీక్షా కేంద్రాల్లో 3374 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాలు టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

రేపటి నుంచి బీఈడీ సెమిస్టర్‌

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 16 నుంచి బీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ 1, 3, 4, సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని పరీక్షల విభాగం కంట్రోలర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలోని 15 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:12 AM