Share News

ఓట్ల లెక్కింపు కేంద్రాలపై నిర్ణయం: కలెక్టర్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:27 AM

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలపై నిర్ణయం: కలెక్టర్‌

నంద్యాల (కల్చరల్‌), ఫిబ్రవరి 14: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఓటర్ల జాబితా, స్ట్రాంగ్‌రూముల నిర్వహణ తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో పద్మజ, కాంగ్రెస్‌ పార్టీ తరుపున సయ్యద్‌ రియాజ్‌ బాషా, టీడీపీ తరపున శివరామిరెడ్డి, బీజేపీ తరుపున అభిరుచి మధు, చంద్రశేఖర్‌ తదితరులు ప్రతిఽనిధులుగా పాల్గొన్నారు. కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ఆర్జీఎం కాలేజ్‌ ఓట్ల లెక్కింపు కేంద్ర నిర్వహణకు ఆక్షేపించడంతో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్వీఆర్‌, శాంతిరాం ఇంజనీరింగ్‌ కాలేజిలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అనుకూలంగా ఉన్నాయని, వీటిపై ఆక్షేపణలు ఎదురైతే కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఫారం 6,8 ద్వారా కొత్తగా నమోదు, సవరణలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే జాబితాలో తొలగింపునకు సంబంధించి నివేదికలు కలెక్టర్‌ కార్యాలయానికి సమర్పించాలని అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో ఈఆర్వోలు, ఎన్నికల విభాగపు అధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమలకు శంకుస్థాపన

నంద్యాల (కల్చరల్‌): ఏపీలోని పలు పరిశ్రమలకు బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాఽథ్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు రూ.4,178 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా బిర్లా గ్రూప్‌, రిలయన్స్‌ ఎనర్జీ, హెల్లాఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్‌, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పోరేషన్‌లకు చెందిన పలు ప్రాజెక్టులకు వర్చు వల్‌గా మంత్రి శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ డా.కె. శ్రీనివాసులు, డీఆర్వో పద్మజ, పరిశ్రమల మేనేజర్‌ శ్రీనివాస్‌యాదఽవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:27 AM