Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:33 PM

శ్రీశైలం మహక్షేత్రానికి ఆదివారం క్షేత్రానికి భక్తు లు పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పటింది.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహక్షేత్రానికి ఆదివారం క్షేత్రానికి భక్తు లు పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పటింది. వేకకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయం ఎదు రుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలు చేశారు. దేవస్థానం అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు. దర్శనానంతరం భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ అందజేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా సదుపా యాలను కల్పించేందుకు దేవస్థానం కార్యాలయం సిబ్బం దికి ప్రత్యేక విధులను కేటాయించారు.

Updated Date - Dec 22 , 2024 | 11:33 PM