Share News

ప్రశాంత వాతావరణం కల్పించాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:41 AM

మంత్రాలయం నియోజకవర్గంలో నామినేషన్లు వేసేందుకు వచ్చే రాజకీయ నాయకులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని ఎస్పీ జి. కృష్ణకాంత్‌ పోలీసు అధికారులకు సూచించారు.

ప్రశాంత వాతావరణం కల్పించాలి

నామినేషన్లలో ఘర్షణలకు తావు ఇవ్వవద్దు

పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ

మంత్రాలయం, ఏప్రిల్‌ 17: మంత్రాలయం నియోజకవర్గంలో నామినేషన్లు వేసేందుకు వచ్చే రాజకీయ నాయకులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని ఎస్పీ జి. కృష్ణకాంత్‌ పోలీసు అధికారులకు సూచించారు. గురువారం ఎన్నికల నామినేషన్లు, స్ర్టాంగ్‌ రూమ్‌లు, పోలింగ్‌ కేంద్రాలు, నామినేషన్ల కార్యాలయాలు, ప్రధాన రహదారుల్లో బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చేవారికి వంద మీటర్ల దూరంలో ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులతో అన్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థుల వెంట ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని, వాహనాలను బయటే పార్కింగ్‌ చేయిచాలని ఆదేశించారు. స్ర్టాంగ్‌ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల సందర్భంగా గొడవల్లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ముహూర్తాలను బట్టి ప్రధాన పార్టీలు ఒక రోజే నామినేషన్లు వేసే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత కల్పించాలని అన్నారు. ఆయన వెంట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌మూర్తి ఉన్నారు. డీఎస్పీ సీతారామయ్య, మంత్రాలయం, కోసిగి సీఐలు ఎరిషావలి, ప్రసాద్‌, మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు గోపినాథ్‌, కృష్ణమూర్తి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు, ఏఎస్‌ఐ ఆనందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:41 AM