Share News

‘కౌంటింగ్‌ పక్కాగా ఉండాలి’

ABN , Publish Date - May 24 , 2024 | 11:33 PM

సాధారణ ఎన్నికలు-2024 కౌటింగ్‌ పక్కాగా జరగాలని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

‘కౌంటింగ్‌ పక్కాగా ఉండాలి’

నంద్యాల (కల్చరల్‌), మే 24: సాధారణ ఎన్నికలు-2024 కౌటింగ్‌ పక్కాగా జరగాలని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు రౌండ్లవారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలని కౌటింగ్‌ కంప్యూటర్‌ సహాయకులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్లో కౌటింగ్‌కు సంబంధించి జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు నియమించిన ఆన్‌లైన్‌ ఎంట్రీ డేటా సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ శిక్షణకు హాజరైన జేసీ మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు రిజల్ట్స్‌.ఈసిఐ.జిఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఎలక్షన్‌ ట్రెండ్స్‌ టీవీలో తెలుసుకునేందుకు వీలుగా జాగ్రత్తగా నమోదుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మజ, మున్సిపల్‌ ఇంజనీరు మధు తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు 813 మంది నియామకం

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి సంబంధించి మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డితో కలిసి కౌటింగ్‌ పర్సనల్స్‌ 1వ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. 813 మంది కౌటింగ్‌ సిబ్బందిని సీపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా అత్యంత పారదర్శకతో మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ, డోన్‌, నందికొట్కూరు, బనగానపల్లె, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు మల్లికార్జునరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎం.దాసు, కామేశ్వరరావు, ఎన్‌ఐసి నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:33 PM