Share News

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 22 , 2024 | 12:27 AM

జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కిం పును పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎ.భార్గవ తేజ అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి

కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి భార్గవతేజ

కర్నూలు(న్యూసిటీ), మే 21: జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కిం పును పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎ.భార్గవ తేజ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు, అవసరమైన ఫెన్సింగ్‌ పనులు, బారికేడ్లు, కుర్చీలు, విధులకు వచ్చే సిబ్బందికి తాగునీరు, ఇంకా కావాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆర్‌ఓ మాట్లాడుతూ అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు, సిబ్బంది లెక్కిం పు కేంద్రంలోకి వచ్చేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలని సూచించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు అవసరమైన ఫెన్సింగ్‌, కుర్చీలు, టేబుళ్ల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పోలీ సులు, కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చారు. ఆయన వెంట డీఈ రవిప్రకాష్‌నాయుడు, ఆర్‌అండ్‌బీ డీఈ భారతి, కార్పొరేషన్‌ ఏఈ జనార్దన్‌ ఉన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:27 AM