Share News

ఓటర్ల జాబితాలో తప్పులను సవరించండి

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:12 AM

ఓటర్ల జాబితాలో తప్పు ఒప్పులను సవరించాలని కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి బీఎల్‌వోలను ఆదేశించారు.

ఓటర్ల జాబితాలో తప్పులను సవరించండి
మాట్లాడుతున్న ఆర్డీవో శేషిరెడ్డి

కర్నూలు(రూరల్‌), ఆగస్టు 20: ఓటర్ల జాబితాలో తప్పు ఒప్పులను సవరించాలని కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి బీఎల్‌వోలను ఆదేశించారు. మంగళ వారం మండల పరిషత సమావేశ భవనంలో రూరల్‌ తహసీల్దార్‌ వెంకట రమేష్‌బాబుతో కలిసి ఆర్డీవో బబీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఇంటింటికి తిరిగి ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు. ఎవరైన మరణించి ఉంటే వారి పేరును తొలగించడం, కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు వుంటే అలాంటి వారిని వెంటనే నమోదు చేయించాలని సూచించారు. ఈసమా వేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 01:12 AM