Share News

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - May 26 , 2024 | 11:30 PM

శ్రీశైలం మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు.

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నాలుగు గంటలకు పైగా దర్శన సమయం

శ్రీశైలం, మే 26: శ్రీశైలం మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందకు క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. వేకువజామున నుంచే అధిక సంఖ్యలో భక్తులు కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి, పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అధికారులు అల్పాహారం, నిరంతరం తాగునీరు అందజేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర ప్రధాన వీధులు కిక్కిరిశాయి. భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణను చేశారు. క్షేత్రపరిధిలోని సత్ర సముదాయాలు రద్దీగా కనిపించాయి.

Updated Date - May 26 , 2024 | 11:30 PM