Share News

ఇళ్ల మధ్య బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటు

ABN , Publish Date - May 31 , 2024 | 12:40 AM

మండలంలోని యర్రగుడి గ్రామంలో బీసీ కాలనీలో ఇళ్ల మధ్య బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ వైసీపీ నాయకుల అండదండలతో వేస్తుండడంతో టీడీ పీ సర్పంచ్‌ దొనపాటి వరలక్ష్మి తోపాటు బీసీ కాలనీవాసులు గురువారం అడ్డుకున్నారు.

ఇళ్ల మధ్య బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటు

అడ్డుకున్న సర్పంచ్‌, బీసీ కాలనీవాసులు

బనగానపల్లె, మే 30: మండలంలోని యర్రగుడి గ్రామంలో బీసీ కాలనీలో ఇళ్ల మధ్య బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ వైసీపీ నాయకుల అండదండలతో వేస్తుండడంతో టీడీ పీ సర్పంచ్‌ దొనపాటి వరలక్ష్మి తోపాటు బీసీ కాలనీవాసులు గురువారం అడ్డుకున్నారు. తమ కాలనీలో కాకుండా ఊరికి సమీపంలో బీఎస్‌ఎ న్‌ఎల్‌ టవర్‌ వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అనంతరం బనగానపల్లె తహసీల్దారు కార్యాలయం వద్దకు సర్పంచ్‌తో పాటు కాలనీ వాసులు చేరుకొని టవర్‌ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని బనగానపల్లె డిప్యూటీ తహసీల్దారు హుసేన్‌బాషాకు వినతిపత్రం సమర్పించారు. యర్రగుడి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీవారు సెల్‌ టవర్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ పంచాయతీ అనుమతులు గాని, తీర్మానం కాని లేకుండానే టవర్‌ ఏర్పాటు చేయడాన్ని సర్పంచ్‌, బీసీ కాలనీవాసులు అడ్డుకున్నారు. బీసీ కాలనీలో ఇళ్ల మధ్య కాకుండా ఊరిబయట టవర్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయ కులు తమకు సెల్‌ టవర్‌ ఏర్పాటుకు కలెక్టరు అనుమతులు ఇచ్చారని అన్నారు. వారి అండతో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు బీసీ కాలనీలో ఇళ్ల మధ్య పోలీస్‌ బందోబస్తు మధ్య టవర్‌ వేయడాన్ని కాలనీవాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ దొనపాటి వరలక్ష్మి మాట్లాడుతూ ఇళ్ల మధ్య సెల్‌ టవర్‌ ఏర్పాటు చేస్తే రేడియేషన్‌ వస్తుందని కానీవా సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 31 , 2024 | 12:40 AM