ప్రత్యేక తరగతులు నిర్వహించండి: డీఈవో
ABN , Publish Date - Feb 21 , 2024 | 12:45 AM
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి సూచించారు.
నందికొట్కూరు, ఫిబ్రవరి 20: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి సూచించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక, బాలుర పాఠశాల లను డీఈవో సుధాకర్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించి వారికి పదో తరగతి పరీక్షలపై పలు ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.