Share News

రైతుబజారులో చౌకధరలు అమలు చేయండి

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:23 AM

రైతుబజారులో చౌకధరలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు.

రైతుబజారులో చౌకధరలు అమలు చేయండి

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 26: రైతుబజారులో చౌకధరలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతుబజారును తనిఖీ చేశారు. నోటీసు బోర్డులో నమోదు చేసిన ధరలకు వ్యాపారులు, పొదుపు గ్రూపు మహిళలు, రైతులు కూరగాయలు విక్రయి స్తున్నారో లేదోనని ఆమె పరిశీలించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యా దులను తప్పకుండా పరిశీలించి వారికి న్యాయం చేయాలని సూచించారు. ఎలక్ర్టానిక్‌ కాటాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ వెంట మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, ఎస్టేట్‌ అధికారి హరీష్‌ కుమార్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌, సెక్యూరిటీ గార్డులు చిన్నస్వామి, గోపాల్‌, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:23 AM