Share News

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:59 PM

శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం రోజున భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
కొబ్బరికాయల సమర్పణ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు

శ్రీశైలం, మార్చి 26: శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కుంభోత్స వాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి కొబ్బరి కాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాధికాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:02 AM