Share News

మార్గదర్శకులను ఎన్నుకోండి

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:12 AM

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో సుపరిపాలన అందించే మార్గదర్శకుల ను ఎన్నుకునే విధంగా ఓటు హక్కు వినియోగించుకో వాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చైర్మన్‌, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.భవానీ ప్రసాద్‌ అన్నారు.

మార్గదర్శకులను ఎన్నుకోండి

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.భవానీ ప్రసాద్‌

కర్నూలులో ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్య పరిరక్షణ’ సమావేశం

అభిప్రాయాలను వెల్లడించిన మేధావులు

కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 11: ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో సుపరిపాలన అందించే మార్గదర్శకుల ను ఎన్నుకునే విధంగా ఓటు హక్కు వినియోగించుకో వాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చైర్మన్‌, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.భవానీ ప్రసాద్‌ అన్నారు. కర్నూలు నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్య పరిరక్షణ’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గాడిచర్ల సర్వోత్తమరావు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కల్కూర చంద్రశేఖర్‌ తెలంగాణ రాష్ట్ర మాజీ సీఈసీ వి.నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ, డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏపీ మాజీ సీఈసీ, డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి పోలంకి సుబ్బారాయన్‌ తదితర ముఖ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ జి.భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ సమాజంలో మంచితనం తగ్గిపోయిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నైతికంగా పతనం అవుతోందన్న విషయాన్ని ఓటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వ్యవస్థలు బాగుండాలంటే నాయకుల తీరును ప్రజలు గమనించాలన్నారు. సమాజం ఎటుపోతుందో అనే భావన నుంచి మేల్కొని ప్రజాస్వామ్యాన్ని ఓటు ద్వారా రక్షించాలన్నారు. కర్నూలు జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, దామోదరం సంజీవయ్య, ఎ.చక్రపాణి, కేబీ. నర్సయ్య వంటి మహనీయులు చట్టసభలకు వెళ్లి మంచి పాలన అందించారన్నారు. కానీ ప్రస్తుతం ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచన ఏ నాయకుడికి రావడం లేదన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:12 AM