కోడి గుడ్ల లారీ బోల్తా
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:51 PM
మండలంలోని కానాలపల్లె మెట్ట వద్ద ఆదివారం కోడిగుడ్ల లారీ బొల్తా పడింది.
గోస్పాడు జూన్ 2: మండలంలోని కానాలపల్లె మెట్ట వద్ద ఆదివారం కోడిగుడ్ల లారీ బొల్తా పడింది. కడప నుంచి నంద్యాలకు వస్తున్న లారీ కానాలపల్లె వద్ద అదుపు తప్పి ఆదివారం తెల్లవారు జామున బోల్తా పడింది. లారీ డైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. లారీలో ఉన్న కోడి గుడ్లను కానాలపల్లె, దీబగుంట్ల గ్రామాల ప్రజలు తీసుకెళ్లారు.