Share News

మహానంది ఆలయ దర్శనం వేళల్లో మార్పు

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:00 AM

మహానంది ఆలయ దర్శనం వేళల్లో ఈ నెల 20 నుండి స్వల్పమార్పులు చేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపారు

 మహానంది ఆలయ దర్శనం వేళల్లో మార్పు
మహానంది ఆలయం ముఖధ్వారం

మధ్యాహ్నం 12.30 నుండి 2 గంటల వరకు విరామం

మహానంది, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మహానంది ఆలయ దర్శనం వేళల్లో ఈ నెల 20 నుండి స్వల్పమార్పులు చేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపారు. మహానివేదన అనంతరం స్వల్ప విరామం అవసరమని వైదిక కమిటీ తీర్మానం మేరకు 20 నుండి మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2 గంటల వరకు దర్శనంలో విరామం ఉంటుందని, ఆ తర్వాత తలుపులు తెరచి రాత్రి 9.30 గంటల వరకు దర్శనం ఉంటుదని ఈవో పేర్కొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:00 AM