Share News

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి: మాండ్ర

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:56 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నందికొట్కూరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి: మాండ్ర
మాండ్ర శివానందరెడ్డి, జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

నందికొట్కూరు, ఏప్రిల్‌ 28: టీడీపీ అధినేత చంద్రబాబు నందికొట్కూరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను మాండ్రతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య ఆదివారం పరిశీలించారు. నందికొట్కూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గుండం రమణారెడ్డి, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

తరిగోపుల గ్రామ మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి, దొరబాబురెడ్డి, గిరీశ్వర్‌రెడ్డి, కోట్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తరిగోపుల గ్రామ వైసీపీ నాయకులు బాబురావు, కృష్ణ, కురువ శంకర్‌, శ్రీరాములు, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన మహేష్‌రెడ్డి, కురువ భాస్కర్‌, అయ్యబ్‌ ఖాన్‌, కురువ ఓబులేసు తదితరులు పార్టీలో చేరారు.

నందికొట్కూరు టీడీపీ నాయకురాలు మీనాక్షి, ఆర్‌ఎంపీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నందికొట్కూరు తాలుకా ఇన్‌చార్జి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు డా.వనజ ఆధ్వర్యంలో మాండ్ర శివానందరెడ్డి, మాండ్ర ఉమాదేవిల సమక్షంలో అర్‌ఎంపీ డాక్టర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డా.నాగరాజు ఆర్‌ఎంపీలు అనూరాధ, గీతారాణి, రమణ చేరారు. అలాగే సంకిరేణిపల్లెకు చెందిన 98 జీవో బాధితులు చెన్నయ్య, సురేష్‌, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌ తదితరులతో పాటు 30 మంది టీడీపీలో చేరారు.

నందికొట్కూరులోని 4వ వార్డు బూత్‌ ఇన్‌చార్జి వడ్డె శ్రీనివాసులు, సురేష్‌, శేఖర్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి మూర్తుజావలి ఆధ్వర్యంలో మాండ్ర శివానందరెడ్డి ప్రచారం చేశారు. నాయకులు శ్రీను, కృష్ణ, సీతారాం, శ్రీకాంత్‌ గౌడు పాల్గొన్నారు.

నందికొట్కూరులో మాండ్ర శివానంద రెడ్డి, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య సమక్షంలో వైసీపీకి చెందిన నాయకులు జాలంగారి నాగన్న, కొణిదేల రవితో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

మిడుతూరు: మిడుతూరు మండలాన్ని వైసీపీ ప్రభుత్వం విర్మరించిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య అన్నారు. టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య సమక్షంలో మిడుతూరు గ్రామంలో మండల కన్వీనర్‌ కాతా రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. జయసూర్య చెరుకు రసం తీసి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గుండం రమణారెడ్డి, శివరామిరెడ్డి, రామ స్వామి రెడ్డి, సర్వోత్తమరెడ్డి, కాతా రాములురెడ్డి, రవీంద్రబాబు, మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:56 PM