Share News

రేపు ఆలూరులో చంద్రబాబు ప్రజాగళం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:40 AM

అలూరులో ఈనెల 19 న జరగనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఽధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు.

రేపు ఆలూరులో చంద్రబాబు ప్రజాగళం

విజయవంతం చేయండి: తిక్కారెడ్డి

కర్నూలు(అర్బన్‌)/ఆలూరు, ఏప్రిల్‌ 17: అలూరులో ఈనెల 19 న జరగనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఽధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19వ తేదీ మధ్యాహ్నం 2.40 గంటలకు ఆలూరు ఆగ్రహారం కొండ ఎదురుగా ఉన్న హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారని, అక్కడి నుంచి 2.55 గంటలకు అంబేద్కర్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ చేరుకుని మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 4.40కి అక్కడి నుంచి బయలు దేరి 4.50 గంటలకు హెలిప్యాడ్‌ చేరుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:40 AM