Share News

‘వృత్తుల వల్లే కుల వ్యవస్థ ఏర్పాటు’

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:37 AM

సనాతన హిందూ సమాజంలో వృత్తుల వల్లే కుల వ్యవస్థ ఏర్పడిందని, అంతే కానీ కులాల మధ్య హెచ్చుతగ్గులు లేవని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) కేంద్ర సామాజిక సమరసత ప్రముఖ్‌ దేవ్‌జీ భాయ్‌ రావత అన్నారు.

‘వృత్తుల వల్లే కుల  వ్యవస్థ ఏర్పాటు’
ప్రసంగిస్తున్న దేవ్‌జీ భాయ్‌ రావత

కర్నూలు కల్చరల్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): సనాతన హిందూ సమాజంలో వృత్తుల వల్లే కుల వ్యవస్థ ఏర్పడిందని, అంతే కానీ కులాల మధ్య హెచ్చుతగ్గులు లేవని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) కేంద్ర సామాజిక సమరసత ప్రముఖ్‌ దేవ్‌జీ భాయ్‌ రావత అన్నారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ కాలనీలోగల వీహె చపీ కార్యాలయంలో జరిగిన కుల సంఘాల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. వీహెచపీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి, జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాశ, ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ సామాజిక సమరసత ప్రముఖ్‌ లింగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:37 AM