Share News

జిల్లాలో త్వరలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:22 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్నట్లు 3.0 క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టులను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తు న్నట్లు డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌ తెలిపారు.

జిల్లాలో త్వరలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కర్‌

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్నట్లు 3.0 క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టులను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తు న్నట్లు డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌ తెలిపారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ డా.బీసా రాయ్‌ మీటింగ్‌ హాలులో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీపీ షుగర్‌తోపాటు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌కు 18 సంవత్సరాలు పైబడిన స్త్రీ, పురుషులను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు, స్టాఫ్‌నర్సులు సర్వే చేసి గుర్తించాలని ఆదేశిం చారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఎఫ్‌బీడీ కార్యక్రమా నికి రెఫర్‌ చేసి తర్వాత పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే అధికారిణి హేమలత, ట్రైనింగ్‌ రిసోర్స్‌ పర్సన్‌ డా.మంజూష, గైనకాలజిస్టు డా.సాహిత్య జయరామ్‌, డెంటిస్టు ఆదర్శ పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:22 AM