Share News

అభ్యర్థుల వ్యయాన్ని లెక్క కట్టండి

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:35 PM

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు పెట్టే ఖర్చులను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్‌ మణికందన్‌ ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్‌ తొట్టుపురం, అశోకన్‌, శ్రీశైలం, నందికొట్కూర్‌, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు టికారం మీనా ఆదేశించారు.

అభ్యర్థుల వ్యయాన్ని లెక్క కట్టండి

ఎన్నికల వ్యయ పరిశీలకులు

నంద్యాల (కల్చరల్‌), ఏప్రిల్‌ 18: పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు పెట్టే ఖర్చులను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్‌ మణికందన్‌ ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్‌ తొట్టుపురం, అశోకన్‌, శ్రీశైలం, నందికొట్కూర్‌, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు టికారం మీనా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో నంద్యాల పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ ఎన్నికల, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించి నమోదు చేసేందుకు సహాయ వ్యయ పరిశీలకులు చురుకుగా, సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.

జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ పరిశీలన

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం కలెక్టరేట్‌ లోని జిల్లా ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ పద్మజ, కంట్రోల్‌ రూమ్‌ నోడల్‌ అధికారి వెంకటసుబ్బయ్య ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎలెకా్ట్రనిక్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌, ఎక్స్‌పెండేచర్‌ మానిటరింగ్‌ సెల్‌, సీజర్స్‌ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధుల గురించి వివరించారు.

Updated Date - Apr 18 , 2024 | 11:35 PM