Share News

సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:21 AM

పౌరసత్వ సవరణ చట్టంను (సీఏఏ) బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దే శాయ్‌ డిమాండ్‌ చేశారు.

సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌

కర్నూలు(న్యూసిటీ), మార్చి 15: పౌరసత్వ సవరణ చట్టంను (సీఏఏ) బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దే శాయ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జమ్మిచెట్ట నుంచి పాతబస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ సీఏఏను ప్రజా పోరాటాలతో ఐదేళ్లు మూలనబెట్టి ఇప్పుడ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుండగా అమలు చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే బీజేపీ ఆడుతున్న నాట కమని అన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, జిల్లా నాయకు లు ఆనంద్‌బాబు, అబ్దుల్లా, రంగప్ప, సుభాన్‌, షరీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 01:21 AM