Share News

శ్రీవారి కుటీర్‌లో చోరీ యత్నం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:47 AM

మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలో జొహరాపురం రోడ్డులో ఉన్న శ్రీవారి కుటీర్‌ కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీ యత్నం జరిగింది

శ్రీవారి కుటీర్‌లో చోరీ యత్నం

కర్నూలు, జూలై 27: మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలో జొహరాపురం రోడ్డులో ఉన్న శ్రీవారి కుటీర్‌ కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీ యత్నం జరిగింది. శ్రీవారి కుటీర్‌ కాలనీలో నివాసముంటున్న ఆర్టీసీ రిటైర్డ్‌ డీఎం దస్తగిరి రెండు రోజుల కింద కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదు వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈయన ఇంట్లో చోరీ యత్నం చేశారు. అయితే.. ఈయన నగదు, నగలు, బీరువాలో కాకుండా ఒక సపరేటు లాకర్‌లో ఉంచడంతో చోరీకి గురి కాలేదు. ఆ తర్వాత అదే కాలనీలో నివాసముండే రవి అనే మున్సిపల్‌ టీచర్‌ ఇం ట్లో చోరీ యత్నం జరిగింది. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి వేంపెంట వెళ్లాడు. దొంగలు ఈయన ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న చీరలు, దుస్తులు కిందకు లాగేసి లాకర్‌ను తెరిచి చూసి చూశారు. ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగి పోయారు. మరో ఇంట్లో తలు పు తాళం పగులకొట్టి లోపల చూశారు. అక్కడా ఏమీ లేకపోవడం వెనుదిరిగి వెళ్లారు. బాధితులు శనివారం ఇండ్లకు వచ్చి చూసి చోరీ యత్నం తీరును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 12:47 AM