Share News

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:27 AM

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ర్యాలీని ప్రారంభిస్తున్న రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి

ఆదోని అగ్రికల్చర్‌ 24 (ఆంధ్రజ్యోతి) : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్షరశ్రీ, మల్లి కార్జున పాఠశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా తీర్చిది ద్దడానికి రోటరీ క్లబ్‌ కృషి ఏనలేనిదని అన్నారు. పోలి యో నిర్మూలనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. 0-5ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలను వేయించాలని సూచిం చారు. సభ్యులు శ్రీధర్‌రెడ్డి, జీవన్‌సింగ్‌, సునీల్‌ రెడ్డి, ప్రశాంత్‌ గాంధీ, సోమశేఖర్‌రెడ్డి, మేఘనాథ్‌ రెడ్డి, సుబ్బయ్య, రాజేష్‌, పద్మనాభయ్య శెట్టి, హుసేన్‌ బాష, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:27 AM