Share News

బుగ్గన గెలవలేడు: కోట్ల

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:56 PM

ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా సంపాదించిన అవినీతి డబ్బుతో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గెలవలేడని టీడీపీ డోన్‌ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

బుగ్గన గెలవలేడు: కోట్ల

డోన్‌, ఏప్రిల్‌ 24: ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా సంపాదించిన అవినీతి డబ్బుతో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గెలవలేడని టీడీపీ డోన్‌ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కోట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ తాము వేసిన రోడ్ల మీద మళ్లీ రోడ్లు వేసి మంత్రి బుగ్గన డబ్బులు సంపాదించుకున్నాడని విమర్శించారు. మంత్రి పదవితో అక్రమంగా బుగ్గన తన ఆస్తులు పెంచుకున్నాడే తప్ప.. ప్రజలు ఎలాంటి అభివృద్ధి చెందారో చూపించగలవా? అంటూ సవాల్‌ విసిరారు. బుగ్గన అక్రమంగా సంపాదించిన డబ్బుతో పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని కొనుగోలు చేసి స్థానిక కార్మికులకు ఉద్యోగాలు లేకుండా చేశాడన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కోట్ల ప్రకటించారు. తనకు కర్నూలు పార్లమెంటు సీటు ఇవ్వకపోతే.. డోన్‌లో వచ్చి పోటీ చేస్తున్నానని బుగ్గన మాట్లాడుతున్నాడని.. బీసీలు రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే తాను త్యాగం చేశానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో డోన్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయకుండా బీసీకి అవకాశం ఇస్తానని, బుగ్గన కూడా పోటీ చేయకుండా వదులుకుంటారా అని సవాల్‌ విసిరారు.

Updated Date - Apr 24 , 2024 | 11:56 PM