రేపటి నుంచి కాల్వబుగ్గలో బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:29 AM
కాల్వబుగ్గ రామేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి.

ఓర్వకల్లు, మార్చి 5: కాల్వబుగ్గ రామేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సావా లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిం చారు. ఆలయ ప్రాంగణమంతా శుభ్రపరిచి గాలిగోపురం, చిన్న కోనేరు, పెద్దకోనేరులో వేసవిలో నీరు ఇంకిపోవడంతో బోరు ద్వారా కోనేటికి నీటిని నింపారు. ఆలయ ప్రాంగణాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, పోలీసు ఔట్‌పోస్టు, ఆరోగ్య కేంద్రం, క్యూలైన్లు, స్నానపుగదులు తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలకరించారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు...
ఫ 7న బుగ్గరామేశ్వర స్వామి కాల్వ గ్రామం నుంచి ప్రయాణం
ఫ 8న మహాశివరాత్రి కుంకురార్పణ, ధ్వజారోహణం, పగలు బుగ్గ రామేశ్వరస్వామి, భ్రమారంభాదేవి పంచామృతాభిషేకం, స్వాములవారికి తెల్లవారుజామున 3.35 గంటలకు కళ్యాణోత్సవం.
ఫ 9న నందివాహన సేవ, సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం
ఫ 10న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం
ఫ 11న పగలు వసంతోత్సవం, సాయంత్రం పారువేట
ఫ 12న బుగ్గరామేశ్వరుని, భ్రమరాంబికాదేవిలకు పంచామృతాభిషేకం
ఫ 13న ఉత్సవమూర్తులు కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం
ఫ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 8న జాతీయ స్థాయి బాలుర ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమ తులు ప్రదానం చేస్తారు. వివరాలకు 7989637970 నెంబరును సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. రాత్రి 9 గంటలకు విజయ ఈవెంట్స్ క్రియేషన్స్ హైదరాబాదు వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్ర మాలు జరగున్నాయి. సినీ సింగర్ రూప, నందకిషోర్, జానపద గంగిరెడ్డి, డ్యాన్సర్ మాలతి, రేలారేలా గోపాల్, సినీ డ్యాన్సర్, సింగర్ రూప, విన్నర్ సూరి, సినీ సింగర్ సోమశేఖర్, సింగర్ విజయ సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
9న భజన పోటీలు: భ్రమరాంబ బుగ్గరామేశ్వరస్వామి భజన మండలి ఆధ్వర్యంలో ఈనెల 9న భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆకుల మహేష్, అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే భజన బృందం సభ్యులు ప్రవేశ రుసుం రూ.400 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. వివరాలకు 9000194078 నెంబరును సంప్రదించాలని సూచించారు.
11న బండలాగుడు పోటీలు: రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి పాలపండ్ల బండలాగుడు పోటీలను నిర్వహి స్తున్నట్లు రైతు సంఘం నాయకుడు నాగతిరుపాలు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 7981016808, 9640643253 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
గుడారాలు ఏర్పాటు చేయండి
ఎండలు మండుతున్నాయి. పుణ్యక్షే త్రానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సేద తీర్చుకునేందుకు గుడారాలు ఏర్పాటు చేయాలి. అలాగే తాగునీరు కూడా అందించాలి.
- జీకే సుధాకర్, కాల్వబుగ్గ మాజీ చైర్మన్
ప్రత్యేక పూజలకు ఏర్పాట్లన్నీ పూర్తి
శివాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశాం.
- కల్లె లక్ష్మీనారాయణ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు
అన్ని వసతులు కల్పిస్తాం
ఉత్సవాలకు వచ్చే భక్తు లకు అన్ని వసతులు కల్పి స్తాం. ఆలయంలో తాగు నీరు, సీసీ కెమెరాలు, ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేశాం
- డీఆర్‌కేవీ ప్రసాద్, ఆలయ ఈవో