మహానందికి బయలుదేరిన బ్రహ్మనందీశ్వరుడు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:19 AM
మహనందీశ్వరుని పెళ్లి పెద్దగా మంగళవారం ప్రత్యేక పల్లకిలో నంద్యాల బ్రహ్మనందీశ్వరుడు మహానందికి వెళ్లారు.

నంద్యాల (కల్చరల్), మార్చి 5: మహనందీశ్వరుని పెళ్లి పెద్దగా మంగళవారం ప్రత్యేక పల్లకిలో నంద్యాల బ్రహ్మనందీశ్వరుడు మహానందికి వెళ్లారు. మహానందిలో శివరాత్రి రోజు ఆదిదేవుడి కళ్యాణానికి బ్రహ్మంనందీశ్వరుడు పెళ్లిపెద్దగా ప్రత్యేక పల్లకిలో బయలుదేరారు. మహానందిలో జరిగే శివరాత్రి ఉత్సవాలలో భాగంగా మహనందీశ్వరుల కల్యాణ పెద్దగా నంద్యాల బ్రహ్మనందీశ్వరుడు వెళ్లి మహనందీశ్వరుల కళ్యాణం నిర్వహించి తిరిగి రావడం ఆనవాయితీగా వస్తోంది. మహానందీ శ్వరుల ఉత్సవమూరులు, బ్రహ్మనందీశ్వరుడు బ్రహ్మనందీశ్వ రాలయం నుంచి కల్పనసెంటర్‌లోని విడది మండపం, బంగారు అంగళ్ల మీదుగా గ్రామోత్సవంలో పూజలందుకొని పెళ్లిపెద్దగా బ్రహ్మనందీశఽ్వరుడు, మహా నందీశ్వర ఉత్సవమూర్తులు మహానంది ఉత్సవాలకు బయలు దేరారు. కార్యక్రమంలో మహానంది ఆలయ సిబ్బంది, అర్చకులు, బ్రహ్మనందీశ్వ రాలయ ఈవో లక్ష్మీనారాయణ, అర్చకులు కానాల మురళీకృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.