Share News

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:56 PM

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. సృజన అధికారులను ఆదేశించారు.

 పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి

1న నియోజకవర్గాల వారీగా పీవో, ఏపీవోలకు శిక్షణ

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి. సృజన

రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశం

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నుంచి షెడ్యూల్‌ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులు గుర్తించిన స్టాటిక్‌ సర్వెలియన్స్‌ టీమ్‌లు ఉండే పాయింట్లను ఇచ్చినట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గాల్లో జరగనున్న ఈవీఎంల రాండమైజేషన్‌ ప్రక్రియకు సంబంధించి వాహనంలో ఎంత మంది కూర్చొని ఉండాలనే సీటింగ్‌ కెపాసిటీతో పాటు ఎన్ని వాహనాలు కావాలనే వివరాలను ఈ నెల 18వ తేదీ నాటికి ఇవ్వాలని ఆర్వోలను ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌తో కూడా సమన్వయం ఉండేలా చూసుకోవాలని సీపీవోను ఆదేశించారు. మే 1న నియోజకవర్గాల వారీగా పీవో, ఏపీవోలకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో, నగర పాలక సంస్థ మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌తేజ, ఆదోని ఆర్వో, సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌శర్మ, డీఆర్వో మధుసూదన్‌రావు, సీపీవో హిమ ప్రభాకర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:56 PM