చెక్‌పోస్టులో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:53 PM
కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి రాకుండా అరికట్టేందుకు చెక్‌పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎక్సైజ్ ప్రొహిబిషన సూపరింటెండెంట్ ఎం.సుధీర్ బాబు అన్నారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు
మంత్రాలయం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి రాకుండా అరికట్టేందుకు చెక్‌పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎక్సైజ్ ప్రొహిబిషన సూపరింటెండెంట్ ఎం.సుధీర్ బాబు అన్నారు. ఆదివారం సాయంత్రం మాధవరం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. రికార్డులను సీసీ కెమెరాల పనితీరు కర్ణాటక మద్యం సరఫరా వంటి వాటిపై ఆరా తీశారు. అనంతరం సీసీ కెమెరాలు జిల్లా, రాష్ట్ర కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుం టామన్నారు. చెక్‌పోస్టులో పని చేసే సిబ్బంది సీసీకెమెరాలతో గస్తి ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీల్లో ఎమ్మిగనూరు ఎక్సైజ్ ఎస్‌ఐ ఇస్మా యిల్, బీఎంపీపీ సీఐ మొహిద్దీన బాషా, చెక్‌పోస్టు సీఐ చంద్రశేఖర్ నాయుడు ఉన్నారు.