Share News

బీసీల ఐక్యత చాటాలి: టీజీ భరత్‌

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:56 AM

కర్నూలు నగరంలోని వాడవాడలా ఉన్న బీసీల ఐక్యతను చాటడానికి కృషి చేయాలని టీడీపీ కర్నూలు ఇన్‌చార్జి టీజీ భరత్‌ అన్నారు.

బీసీల ఐక్యత చాటాలి: టీజీ భరత్‌

ఘనంగా జయహో బీసీ సదస్సు

కర్నూలు(అర్బన్‌), జనవరి 10: కర్నూలు నగరంలోని వాడవాడలా ఉన్న బీసీల ఐక్యతను చాటడానికి కృషి చేయాలని టీడీపీ కర్నూలు ఇన్‌చార్జి టీజీ భరత్‌ అన్నారు. బుధవారం నగరంలోని మౌర్యఇన్‌ హోటల్‌ లో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జయహో బీసీ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీకి బీసీలు వెన్నెముక వంటి వారిని, పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు తగిన గుర్తింపు ఉందన్నారు. టీడీపీ హయంలో బీసీలకు జరిగిన మేలుతో పాటు ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ లకు స్వయం ఉపాధి రుణాలు, చేతి వృత్తులకు ఆదరణ పథకం కింద రాయితీపై పరికరాలు అందించినట్లు గుర్తు చేశారు. బీసీలు బలహీనులు కాదని, బలవంతులన్నదే తమ పార్టీ సిద్ధాంతమని టీజీ భరత్‌ అన్నారు. కర్నూలులో ఉన్న బీసీలందరూ ఏకం కావాల్సిన సమయంలో అసన్న మైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసమూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:56 AM