Share News

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

ABN , Publish Date - May 23 , 2024 | 01:11 AM

ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కిందట నిషేధం విధించింది.

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
కర్నూలు మార్కెట్‌ యార్డుకు రైతులు తెచ్చిన ఉల్లి

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 22: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కిందట నిషేధం విధించింది. దీంతో ఏపీ రాష్ట్రంలో ఉల్లి పంటను అత్యఽ దికంగా సాగు చేస్తున్న జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరిగింది. గతంలో దేశంలోని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకే కాకుండా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక తదితర దేశాలకు ఉమ్మడి జిల్లాలోని రైతులు ఉల్లిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు. అయితే ఆరు నెలల కిందట ఉల్లి ధరలు పెరగడంతో విదేశాలకు ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించి ధరల నియంత్ర ణకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు మారు తున్నప్పటికీ ఉల్లిని మాత్రం ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో తప్పనిసరిగా వాడుతున్నారు. దీంతో ఉల్లికి డిమాండ్‌ పెరిగింది. ప్రపంచ ఉల్లి సాగులో చైనా తర్వాత ఇండియానే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంది. భారతదేశంలో రకరకాల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండటం ఉల్లి సాగుకు అనుకూలంగా మారింది. ప్రధానంగా మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో.. అందులోనూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో ఉల్లి పంటను జూన్‌, జూలై మాసాల్లో విత్తుతుండగా.. అక్టోబరు, నవంబరు నెలలో ఆ పంట రైతుల చేతికి వస్తుంది. రబీ విషయానికి వస్తే.. అక్టోబరు, నవంబరులో సాగు చేస్తే.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో పండే ఉల్లి నిల్వ చేసేందుకు అనుకూలం. క్రమక్రమంగా ఉల్లి సాగు రైతులకు కష్టాలతో పాటు నష్టాలను కూడా తెచ్చి పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30వేల హెక్టార్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉల్లి ఎగుమతులు పెరిగి ఉమ్మడి జిల్లాలో సాగవుతున్న ఉల్లికి డిమాండ్‌ పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 01:11 AM