Share News

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్‌

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:02 AM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్‌రామ్‌ అని కలెక్టర్‌ డా.జి.సృజన అన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్‌

కలెక్టర్‌ జి.సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 5: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్‌రామ్‌ అని కలెక్టర్‌ డా.జి.సృజన అన్నారు. శుక్రవారం బాబు జగ్జీవన్‌రామ్‌ 117వ జయంతి సందర్భంగా నగరంలోని ఆర్‌ఎస్‌ రోడ్డు కూడలిలో ఉన్న బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలని కోరారు. బాబు జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కుటుంబంలోని పిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, సెట్కూరు సీఈవో రమణ, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:02 AM