Share News

పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి: కమిషనర్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:19 AM

విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై పాఠశాలల స్థాయి నుంచే ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని నగర కమిషనర్‌ రవీంద్ర బాబు అన్నారు.

పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి: కమిషనర్‌
మాట్లాడుతున్న కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు ఎడ్యుకేషన, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై పాఠశాలల స్థాయి నుంచే ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని నగర కమిషనర్‌ రవీంద్ర బాబు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ టౌనమోడల్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాఠశాల యజమాన్య కమిటీ శిక్షణ కార్యక్ర మం డీఈవో శ్యామ్యూల్‌పాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు విద్య, క్రమశిక్షణ, వారి ప్రవర్తనల పట్ల ఉపాధ్యాయులు నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. డీఈవో శామ్యూల్‌ పాల్‌ మాట్లాడుతూ మండల రీసోర్స్‌పర్సన్లు శిక్షణా తరగతు లను వినియోగించుకోవాలని, మండల స్థాయిలో మీరు తిరిగి పాఠశాల యజమాన్య కమిటీ సభ్యులకు ఉపాధ్యాయులకు శిక్షణ ద్వారా అందిం చాలని సూచించారు. కార్యక్రమంలో కేఆర్‌పీ విజయభాస్కర్‌, జిల్లా రీసోర్స్‌ పర్సన వినోద్‌, విజయకుమారి, కమ్యూనిటీ మొబైలేజేషన ఆఫీసర్‌ శివశంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:19 AM