Share News

బుగ్గనకు ఆర్యవైశ్యులు బుద్ధి చెబుతారు

ABN , Publish Date - May 12 , 2024 | 12:40 AM

ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి బుగ్గనకు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోట్రికే హరికిషన్‌ అన్నారు.

బుగ్గనకు ఆర్యవైశ్యులు బుద్ధి చెబుతారు

డోన్‌, మే 11: ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి బుగ్గనకు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోట్రికే హరికిషన్‌ అన్నారు. శనివారం పట్ట ణంలోని తన నివాసంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్‌, సేనా, ఓంప్రకాష్‌లతో కలిసి హరికిషన్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సంద ర్భంగా పట్టణంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన మంత్రి బుగ్గన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్న తనపై బురదజల్లుతూ ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. తమ కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా పని చేశారని, డోన్‌ ప్రజల అభివృద్ధితో పాటు ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా కావడానికి ఆర్యవైశ్యులు ఎంతగానో పని చేశారన్నారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించి ఆర్యవైశ్యులనే అవమానిం చేలా మంత్రి బుగ్గన మాట్లాడటం తగదని, ఎన్నికల్లో ఆర్యవైశ్యుల సత్తా ఏమిటో బుగ్గనకు చూపించి గుణపాఠం చెబుతామన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సం ఘం నాయకులు డా.రాజాపల్లి జగన్మోహన్‌, పెద్దపల్లి గుప్త, బచ్చు చక్రి, రజిని, కల్లం సత్యనారాయణ, హరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:40 AM