Share News

మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:45 PM

కర్నూలు మార్కెట్‌ యార్డులో 13 రకాల పంట ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పంట ఉత్పత్తుల విక్రయం కర్నూలు మార్కెట్‌ యార్డులో జరగడం విశేషం. తాజాగా వరి ధాన్యం క్రయవిక్రయాలను చేపట్టేందుకు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి మంగళవారం తన కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు

మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
మిల్లర్లతో మాట్లాడుతున్న జయలక్ష్మి

మిల్లర్లతో చర్చించిన సెక్రటరీ జయలక్ష్మి

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో 13 రకాల పంట ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పంట ఉత్పత్తుల విక్రయం కర్నూలు మార్కెట్‌ యార్డులో జరగడం విశేషం. తాజాగా వరి ధాన్యం క్రయవిక్రయాలను చేపట్టేందుకు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి మంగళవారం తన కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. మిల్లర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సంక్రాంతి పండుగలోపు ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మిర్చి యార్డు సమీపంలో లేదా మరో చోట ధాన్యం అమ్మకాలను ప్రారంభించేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగే్‌షతో పాటు టీఎన్‌టీయూసీ నాయకులు శేషగిరిశెట్టి పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:45 PM