Share News

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ: ఆర్డీవో

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:53 AM

రాబోవు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అందరూ సహకరించాలని ఆర్డీవో శేషిరెడ్డి అన్నారు.

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ: ఆర్డీవో

గూడూరు, ఫిబ్రవరి 28: రాబోవు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అందరూ సహకరించాలని ఆర్డీవో శేషిరెడ్డి అన్నారు. బుధవారం గూడూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీల నాయ కులతో ఆర్డీవో రాబోవు ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో శేషిరెడ్డి మాట్లాడుతూ కోడుమూరు నియోజక వర్గంలో కోత్తగా 15,917 మంది ఓటర్లు చేరారని, దీంతో నియోజక వర్గంలో మొత్తం 2,41,767 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 275 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, అందులో 11 చోట్ల పోలింగ్‌ కేంద్రాలను మార్చేం దుకు ప్రతిపాదనలు, అలాగే 84 చోట్ల పోలింగ్‌ కేంద్రాల గదుల పేర్లు చేర్చడం కోసం ప్రతిపాదనలు చేశామని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలు ఉందన్నారు. అభ్యర్థుల ఖర్చులు చూసేందుకు అధికారుల బృందం ఉంటుం దని, అలాగే వాహనాల అనుమతి, పోలింగ్‌, కౌటింగ్‌ వెళ్ళెవారికి పాసులు, అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ గూడూ రులోనే ఏర్పాటు చేయాలని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్డీవో ను కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌, ఎన్నికల డీటీ ప్రవీన్‌, టీడీపీ తరపున పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయు డు, వైసీపీ తరపున నగర పంచాయతీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్లు పీఎన్‌ అస్లాం, లక్ష్మన్న, బీజేపీ తరపున మల్లేష్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 09:49 AM