Share News

విధ్వంసక పాలనపై చర్చకు సిద్ధమా..?

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:21 AM

గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి విధ్వంసక పాలనపై కొండారెడ్డి బురుజు వద్ద చర్చకు సిద్ధమా అంటూ వైస్సార్సీపీ నాయకులకు ఎమెల్మీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు సవాలు విసిరారు.

విధ్వంసక పాలనపై చర్చకు సిద్ధమా..?

వైసీపీ నేతలకు బీటీ నాయుడు సవాల్‌

కర్నూలు(అర్బన్‌), ఫిబ్రవరి 19: గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి విధ్వంసక పాలనపై కొండారెడ్డి బురుజు వద్ద చర్చకు సిద్ధమా అంటూ వైస్సార్సీపీ నాయకులకు ఎమెల్మీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు సవాలు విసిరారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ తన పాలనలో అంతా విధ్వంసం చేసి ఇప్పుడు సిద్ధం అంటూ సభలు పెడుతున్నారని, ఇంతకూ ఆయన దేనికి సిద్ధం అని ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు కానీ ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అనంతపురంజిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ గుండాలు ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై దాడి చేయడం అన్యాయమని అన్నారు. ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు బలగాలు ఉన్నచోటే ఇలా జరిగిందంటే.. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలం ఉన్నట్లే అని అన్నారు. వెంటనే సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఏ2 గా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, హనుమంతరావుచౌదరి, సత్రం రామక్రిష్ణుడు, సోమిశెట్లి నవీన్‌, డీ. జేమ్స్‌, కుంపటి కృష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 01:21 AM