Share News

ఏజెంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి: ఆర్‌ఓ

ABN , Publish Date - May 23 , 2024 | 01:09 AM

ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌కు సంబంధించిన ఏజెంట్ల ఏర్పాటుకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలని కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎ.భార్గవతేజ రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.

ఏజెంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి: ఆర్‌ఓ

కర్నూలు(న్యూసిటీ), మే 22: ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌కు సంబంధించిన ఏజెంట్ల ఏర్పాటుకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలని కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎ.భార్గవతేజ రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు. బుధవారం కార్యాలయంలోని పాతకౌన్సిల్‌ హాలులో నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓ భార్గవతేజ మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపునకు ఏజెంట్ల ఏర్పాటు కోసం 30న సాయంత్రం 5 గంటల లోపు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏజెంట్లకు ఫొటోతో ఐడెంటిటీ కార్డు ఇస్తామన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించడానికి ప్రత్యేక గదిలో 4 టేబుళ్లు ఏర్పాటు చేశామని, నలుగురు ఏజెంట్లను నియమిం చుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా కౌంటింగ్‌కు సంబంధించి 14 టేబుళ్లకు 14 మందిని ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఏజెంట్లు అందరూ కౌంటింగ్‌కు గంట ముందు సెంటర్‌కు చేరుకోవా లన్నారు. సెంటర్లలోకి సెల్‌ఫోన్స్‌/ఎలకా్ట్రనిక్‌ పరికరాలను తీసుకురావద్దన్నారు. పోటిలో ఉండే అభ్యర్థులు ఏజెంట్లకు అవగాహన కల్పించి పంపించాలని ప్రతి నిధులకు ఆర్‌ఓ సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 08:39 AM