Share News

ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:59 PM

బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.

ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌
జస్టిస్‌ నాగార్జునరెడ్డికి ఉమామహేశ్వరస్వామి చిత్రపటాన్ని అందిస్తున్న ఈవో

బనగానపల్లె, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. నాగార్జునరెడ్డి దంపతులకు ఆలయ ఈవో చంద్రుడు, పాతపాడు సర్పంచ్‌ బెడదల మహేశ్వరరెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కాశీంబాబు, ఆలయ పూజారులు, విద్యుత్‌ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్‌ నాగార్జునరెడ్డి దంపతులు యాగంటి ఉమామహేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. యాగంటి ఉమామహేశ్వరస్వామి చరిత్రను పూజారులు వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు నాగార్జునరెడ్డికి అందించారు. జస్టిస్‌ నాగార్జునరెడ్డికి ఉమామహేశ్వరస్వామి చిత్రపటాన్ని వారు అందించారు.

Updated Date - Oct 20 , 2024 | 11:59 PM