Share News

ప్రారంభమైన ఏపీఈఏపీసెట్‌

ABN , Publish Date - May 16 , 2024 | 11:14 PM

ప్రారంభమైన ఏపీఈఏపీసెట్‌

ప్రారంభమైన ఏపీఈఏపీసెట్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 16: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు గురువారం ప్రారంభమైంది. ఏపీఈఏపీ సెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి. గురువారం అగ్రికల్చర్‌, బీ-ఫార్మసీ కోర్సులకు ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కన్వీనర్‌ నిర్వహించిన సమయం కంటే విద్యార్థులు గంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి చేరుకోవడంతో రద్దీగా కనిపించింది. గురువారం ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కర్నూలులో 6, ఎమ్మిగనూరు, ఆదోనిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ కేంద్రాల్లో మొత్తం ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ-ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం అభ్యర్థులు 19,606 మంది నమోదు చేసుకున్నారు. ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెల్‌ఫోన్లు నిల్వ చేసుకోవడానికి లాకర్స్‌ను పరీక్ష నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మొదటి రోజు అగ్రికల్చర్‌, బీ ఫార్మసీ కోర్సుల ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అగ్రికల్చర్‌, బీ-ఫార్మసీ విభాగాలకు చెందిన మొత్తం అభ్యర్థులు 8,248 మంది నమోదు చేసుకున్నారు. ఇందులో మొదటి రోజు 3,675 మందికి గాను 3,419 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 156 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 93.03 శాతం హాజరు నమోదైంది.

Updated Date - May 16 , 2024 | 11:14 PM