Share News

నేడు ఏపీ సెట్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:05 AM

విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుల అర్హత పరీక్షకు సంబంధించి ఏపీసెట్‌-2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాయలసీమ యూనివర్సిటీ రెక్టార్‌, కర్నూలు రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య ఎన్‌టీకే నాయక్‌ తెలిపారు.

నేడు ఏపీ సెట్‌

9 కేంద్రాల్లో 3,883 మంది దరఖాస్తు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 27: విశ్వవిద్యాలయాలతో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుల అర్హత పరీక్షకు సంబంధించి ఏపీసెట్‌-2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాయలసీమ యూనివర్సిటీ రెక్టార్‌, కర్నూలు రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య ఎన్‌టీకే నాయక్‌ తెలిపారు. ఈనెల 28న ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలోని 9 పరీక్షా కేంద్రాల్లో 3,883 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. ఈ పరీక్షల్లో మొదటి పేపర్‌ అన్ని సబ్జెక్టుల వారికి కామన్‌గా ఉంటుందని, రెండో పేపరు ఆప్షనల్‌గా ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని కోరారు. అభ్యర్ధులు బ్లాక్‌ లేదా బ్లూ కలర్‌ బాల్‌ పెన్నుతో ఓఎంఆర్‌ షీటులో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుందన్నారు.

లోటుపాట్లు లేకుండా చూడాలి

ఏపీసెట్‌-2024 పరీక్షలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించా లని స్పెషల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాసులు పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శనివారం నగరంలోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి నిర్వహణ ఏర్పాట్లను రీజనల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌టీకే నాయక్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

Updated Date - Apr 28 , 2024 | 12:05 AM