ఎప్పుడైనా కూలొచ్చు..!
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:20 AM
కర్నూలు నగరానికి తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రమాదంలో పడింది.
కర్నూలు, న్యూసిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరానికి తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రమాదంలో పడింది. మునగలపాడు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు 16 పిల్లర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పిల్లర్లు మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి. మొదటి రెండు పిల్లర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని అమర్చిన కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుపైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరుకున్న ట్యాంకు పిల్లర్లు ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుకోని ప్రమాదం జరగకముందే అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సంబంధించి మరమ్మతులను ఉన్నతాధికారులతో కలిసి యుద్ధప్రాతిపదికన చేపడతామని నగర పాలక ఎస్‌ఈ రాజశేఖర్ తెలిపారు.