Share News

ప్రభుత్వ వైద్యశాలలో వసతులేవీ?

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:37 AM

బనగానపల్లె పట్టణంలో సీఎం జగన్‌ ఇటీవల ప్రారంభించిన వంద పడకల ఆస్పత్రిలో కనీస వసతులు కూడా లేవని, వైద్య పరికరాలు కూడా లేవని బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ వైద్యశాలలో వసతులేవీ?

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఫైర్‌

బనగానపల్లె, ఏప్రిల్‌ 17: బనగానపల్లె పట్టణంలో సీఎం జగన్‌ ఇటీవల ప్రారంభించిన వంద పడకల ఆస్పత్రిలో కనీస వసతులు కూడా లేవని, వైద్య పరికరాలు కూడా లేవని బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఎన్‌జీవో కాలనీ, విద్యుత్‌ కార్యాలయం ఆవరణలో బీసీ ఇంటింటి ప్రచారం చేశారు. బీసీ మాట్లాడుతూ రాత్రి వేళల్లో ప్రథమ చికిత్సకు కూడా దిక్కులేని పరిసితి ఉందని అన్నారు. పైన పటారం, లోన లొటారంలాగా బనగానపల్లె 100 పడకల ఆస్పత్రి ఉందని విమర్శించారు. వైసీపీ దళిత ద్రోహుల పార్టీ అన్నారు. జగన్‌ దళితులను అవమానించిన వారికి ఆశ్రయమిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన దళిత యువకుడు కొండ్ర శ్యామ్‌కుమార్‌ను కొందరు శాడిస్టులు నాలుగు గంటలపాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని, దాహం వేస్తే ఆయన నోట్లో మూత్రం పోసి సభ్యసమాజం తలిదించుకునేలా చేశారన్నారు. సీఎం జగన్‌కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌బాబు తాను కూడా బాఽధితుడినే అని వాపోయారని తెలిపారు. దళిత అంగన్‌వాడీ కార్యకర్తలను సైతం వేధించారన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:37 AM