Share News

సంచారం లేని వాహనం

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:00 AM

గ్రామా ల్లోని పశుువులకు వైద్య సేవలదించేందుకు పభుత్వం సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ 1962ను ఏర్పాటు చేసింది. ఆలూరు పశువైద్యశాలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాన్ని కూడా కేటాయించారు. పశు వైద్యురాలు, డ్రైవర్‌ను నియమించారు.

సంచారం లేని వాహనం
మూలన పడ్డ సంచార పశు ఆరోగ్యసేవ వాహనం

ఆలూరులో మూలనపడ్డ సంచార పశువైద్య వాహనం

అవస్థలు పడుతున్న రైతులు, పశు యజమానులు

ఆలూరు, డిసెంబరు29 (ఆంధ్రజ్యోతి): గ్రామా ల్లోని పశుువులకు వైద్య సేవలదించేందుకు పభుత్వం సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ 1962ను ఏర్పాటు చేసింది. ఆలూరు పశువైద్యశాలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాన్ని కూడా కేటాయించారు. పశు వైద్యురాలు, డ్రైవర్‌ను నియమించారు.

మూడు నెలలుగా మూలకు.

అయితే ఈ వాహనం మూడునెలలుగా మూలకు పడింది. వాహనంలోని బ్యా టరీ చోరీకి గురి కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని సిబ్బ ంది చెబుతున్నారు. మరో బ్యాటరీ అమర్చితే పనిచేసే అవకాశముంది. ఈ విషయం లో అధికారులు పట్టించు కోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

రైతుల అవస్థలు..

సంచార వాహనం పనిచే యకపోవడంతో రైతులు, పశువుల యజమానులు అవ స్థలు పడుతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఆలూరు పశు వైద్యశా లకు రావలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా వాహనం కదలక పోవడంతో డ్రైర్‌ కూడా పత్తా లేకుండా పోయాడు. దీంతో సిబ్బంది ఇక్కడే విధులు నిర్వహించి వెళ్లిపోతున్నారు.

మూడు నెలలుగా నిలిచిపోయింది

సంచార పశువైద్యశాల వాహనం మూడు నెలలుగా నిలిచిపోయింది. విషయాన్ని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు తెలియజేశాం. డ్రైవర్‌ కూడా రావడం లేదు. టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు రైతులతో మాట్లాడి ఇక్కడే చికిత్స చేస్తున్నాం. మరమతులు పూర్తయిన వెంటనే యథావిధిగా గ్రామాలకు నేరుగా వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తాం. - డా.అంజలి, పశు వైద్యురాలు, సంచార పశు ఆరోగ్యసేవ వాహనం

Updated Date - Dec 30 , 2024 | 12:03 AM