Share News

అమిత్‌ షా రాజీనామా చేయాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:30 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ అన్నారు. సీపీఎం 23వ కర్నూలు జిల్లా మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

అమిత్‌ షా రాజీనామా చేయాలి

మాట్లాడుతున్న ఎంఏ గఫూర్‌

ఎమ్మిగనూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ అన్నారు. సీపీఎం 23వ కర్నూలు జిల్లా మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రితోపాటు బీజేపీలో ఎవరికి రాజ్యాంగం పట్ల, అంబేడ్కర్‌ పట్ల గౌరం లేదని అన్నారు. వారికి మనుధర్మ శాస్త్రంపై మాత్రమే నమ్మకం ఉందని విమర్శించారు. బీజేపీ వల్ల రాజ్యాంగానికి నష్ట వాటిల్లుతుందని, దీని ద్వారా రిజర్వేషన్లు, రాష్ర్టాల హక్కులు సెక్యులరిజానికి, సమాజానికి నష్ట కలిగించే పరిణామాలన్నారు. దీంతో రాజ్యాం గాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను గౌరవించలేని అమిత్‌ షా రాజీనామా చేయాలని సీపీఎం, సీపీఐ వామపక్ష పార్టీలు ఉద్యమించనున్నాయని తెలిపారు. ఇప్పటికే సీపీఎం, సీపీఐ, వామపక్ష పార్టీలతోపాటు దళిత సంఘాలు మద్దతిచ్చాయన్నారు. రాష్ట్రం విభజన తరువాత, జిల్లాల విభజన తరువాత అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలే అన్నారు. గతంలో అనంతపురం ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉండేదని, అయితే ఆ జిల్లాకు కియా ఫ్యాక్టరీ, హంద్రీనీవా జలాలు రావటంతో ఉపాధి, పండ్ల తోటలు పెంపకం పెరగటంతో అక్కడ పరస్థితి మారిందన్నారు. కర్నూలు జిల్లా మీదుగా తుంగభద్ర నదీజలాలు సముద్రం పాలవుతున్నా జిల్లాలో అనేక ఎకరాలకు సాగునీరు అందించలేక పోతున్నారన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందన్నారు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ప్రజలు నిత్యం వలస బాటపడుతున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల గ్రామాల్లో ఉంటే మరో ఆరు నెలలు ఇతర ప్రాంతాల ప్రజలుగా జీవించాల్సి వస్తుందన్నారు. 78 ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా వల సలు వెళ్తున్నారంటే ఈ రాష్ర్టాన్ని పాలించిన పాలకులు, ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఏమాత్రం పని చేశారో తెలుసుకోవాలని అన్నారు. సాగు, తాగునీటి ప్రాజె క్టులు, పరిశ్రమల సాధన, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనకు, వలస నివారణకు తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాటాలు చేస్తామన్నారు. ఇందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు రామాంజనేయులు, రాధాకృష్ణ, గోవిందు, హనుమంతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:30 AM