అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:59 AM
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వైఖరిని నిరసి స్తూ శనివారం పత్తికొండలో దిష్టిబొమ్మను దహనం చేశారు.

పత్తికొండలో అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు
కొనసాగుతున్న నిరసనలు
పత్తికొండలో దిష్టిబొమ్మ దహనం
పత్తికొండ టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వైఖరిని నిరసి స్తూ శనివారం పత్తికొండలో దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ వచ్చాక మత ప్రాదిక పైనే పరిపాలన చస్తున్నారని పార్లమెంట్ సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్య లు చేయడం సరికాదన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, మండల కార్యదర్శి రాజాసా హెబ్, పట్టణ కార్యదర్శి రామాం జనేయులు, ప్రజా సంఘాల నాయకులు కారన్న, కృష్ణ, తిమ్మ య్య, ఎంకే సుంకన్న, సిద్ద లింగప్ప, సుల్తాన్, నెట్టికంటయ్య, హనుమేష్, పాల్గొ న్నారు.
అమీత్‌షాను పదవి నుంచి తొలగించాలి
ఆదోని రూరల్: పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అవమానంగా మాట్లాడిన అమీత్‌షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అమీత్‌షాకు వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిండు సభలో అంబేద్కర్‌ను హేళన చేస్తూ, అమీత్ షా మాట్లాడడం దారుణమని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసులు, బొబ్బిలి, జూనైద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.