Share News

కార్యకర్తలందరూ సభ్యత్వం తీసుకోవాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:09 AM

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సూచించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యకర్తలందరూ సభ్యత్వం తీసుకోవాలి
టీడీపీ కార్యాలయంలో సభ్యత నమోదు కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, నాయకులు

కర్నూలు అర్బన్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సూచించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొదటి సభ్యత్వం మంత్రి, ఎంపీలు కలిసి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌ చేత రూ. లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని, పార్టీలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. కేవలం రూ. 100తో సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమాతో పాటు విద్యా, ఉద్యోగం, వైద్య సహాయం అందుతుందని తెలిపారు. సభ్యత్వం ద్వారా సేకరించిన డబ్బును అన్‌లైన్‌ ద్వారా సేకరించి పార్టీ కోసం శ్రమించి ప్రాణాలు కోల్పోయిన 16,712 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తారని తెలిపారు. పార్టీ నిర్వహించే విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, పార్టీ సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధికంగా పార్టీ సభ్యత్వం నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరరావు యాదవ్‌, నంద్యాల నాగేంద్ర, ఆకెపోగు ప్రభాకర్‌, టూరిజం శాఖ డైరెక్టర్‌ ముంతాజ్‌, సత్రం రామక్రిష్ణుడు, ధరూర్‌ జేమ్స్‌, హనుమంతరాయ చౌదరి పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:09 AM