Share News

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:43 AM

జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలి

ఎస్పీ బిందు మాధవ్‌

కర్నూలు, జూలై 27: జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ట్రాఫిక్‌పై ఆర్టీసీ, ట్రాన్స్‌కో, నేషనల్‌ హైవే అథారిటీ, మున్సిపల్‌, పోలీసు ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుం డా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల భద్రతకు అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని, ముఖ్యమైన రహదారులు, రద్దీ ప్రాంతాలలో సీసీ కెమె రాలను ఏర్పాటు చేస్తే నేర నివారణకు దోహదపడుతాయన్నారు. పని చేయని సీసీ కెమెరాల లోటుపాట్లు తెలుసుకుని అవి పని చేసే విధంగా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన మలుపుల వద్ద బారికేడ్లు, స్టాప ర్స్‌, ప్రమాద సంకేత సూచికలను పొందుపరచాలన్నారు. బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి చర్యలు తీసుకోవాలని నేషనల్‌ హైవే అథారిటీ అధికారి అధికారు లను ఆదేశించారు. నగరంలో ఆటోలు ఇతర వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రీలెఫ్ట్‌గా వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ బస్టాండులోకి వెళ్లి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకునే విధంగా ఆటోలకు ఒక స్థలం కేటాయించేందుకు పరిశీలన చేయాలన్నారు. రైల్వేస్టేషన్‌ కు గూడ్స్‌ రైళ్లలో వచ్చే రైస్‌ను గోడౌన్లకు తరలించే లారీలు పట్టణంలో రాత్రి వేళలో మాత్రమే తిరిగే విఽ దంగా చూడాలన్నారు. ట్రా ఫిక్‌ ఇబ్బంది కలిగే విధంగా కరెంటు పోల్స్‌ ఉంటే వాటిని కూడా పరిశీలించా లని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయంపై తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్‌ సీఐ గౌతమికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు మహబూబ్‌ నగర్‌, కడప, అనంతపురం డివిజ నల్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు, డిప్యూటీ సిటీ ప్లానర్‌ సంధ్యారాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గిరిరాజు, ఏఈ ప్రవీణ్‌, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శభరీష్‌, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, ట్రాఫిక్‌ సీఐ గౌతమి, డీటీఆర్‌బీ సీఐ ఆదినారాయణ రెడ్డి, ట్రాన్స్‌కో అధికారులు, సీఐ పార్థసారధిరెడ్డి, ఎస్‌ఈ ఉమాపతి పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:43 AM